Jump to content

మొదటి పేజీ

వికీపీడియా నుండి
వికీపీడియా ఎవరైనా రాయదగిన స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము.
ఇక్కడ సమాచారాన్ని వాడుకోవటమే కాదు, ఉన్న సమాచారంలో అవసరమైన మార్పుచేర్పులు చెయ్యవచ్చు, కొత్త సమాచారాన్ని చేర్చవచ్చు.
ప్రస్తుతం తెలుగు వికీపీడియాలో 1,25,878 వ్యాసాలున్నాయి. పూర్తి గణాంకాలు చూడండి.
పరిచయం అన్వేషణ కూర్చడం ప్రశ్నలు సహాయము తెలుగు టైపుచేయుట

విహరణ విశేష వ్యాసాలు ఱ సూచీ

ఈ వారపు వ్యాసం
తెలుగు పత్రికలు

తెలుగు పత్రికల ప్రచురణ 19 వ శతాబ్ది తొలి అర్ధ భాగంలో మొదలైంది. తొలి తెలుగు పత్రిక 1832 ప్రాంతంలో వెలువడింది. మద్రాసు నుండి కర్నాటిక్ గెజెట్ అనే ప్రచురణ తెలుగు, తమిళ, ఇంగ్లీషు భాషల్లో వెలువడేది. ఇదే తెలుగులో వెలువడ్డ తొలి పత్రిక. ఆ తరువాత 1835 ప్రాంతంలో బళ్ళారి లేదా మద్రాసు నుండి సత్యదూత అనే పత్రిక వచ్చినట్లుగా కొన్ని మూలాల్లో ఉంది గానీ దానికి ఖచ్చితమైన ఆధారం లభించలేదు. 1837 లో వృత్తాంతి అనే పత్రిక మొదలైంది. ఆ తరువాత వర్తమానతరంగిణి వెలువడింది. 1862 లో మచిలీపట్నం నుండి హితవాది అనే క్రైస్తవ మత పత్రిక వెలువడింది. 1880 ల నుండి తెలుగు పత్రికలు తామరతంపరగా పుట్టుకొచ్చాయి. మద్రాసు నుండే కాక, ఆంధ్ర ప్రాంతం లోని పలు ప్రదేశాల నుండి పత్రికలు వెలిసాయి. రాజమహేంద్రవరం, మచిలీపట్నం కేంద్రాలుగా పలు పత్రికలు వచ్చాయి. పట్టణాల నుండే కాక, చిన్న చిన్న గ్రామాల నుండి కూడా పత్రికలు వెలువడ్డాయి. రావటానికి ఎన్నో వచ్చినప్పటికీ, వాటిలో దీర్ఘకాలం మనగలిగిన పత్రికలు చాలా తక్కువ. 1875-1926 మధ్య కాలంలో 516 పత్రికలు వెలువడగా, వీటిలో చాలా పత్రికలు కొద్దికాలానికే మూతబడ్డాయి. 1940 నాటికి 184 పత్రికలు ప్రచురణలో ఉన్నాయి. 19 వ శతాబ్ది చివరి దశాబ్దాల్లో పత్రికల సర్క్యులేషను సాధారణంగా 100 నుండి 500 వరకు ఉండేది. వెయ్యికి పైన ప్రతులు ముద్రించిన తొలి రాజకీయ పత్రిక, కృష్ణాపత్రిక. 1930 ల నాటికి పత్రికల సర్క్యులేషను 3 వేల వరకు చేరింది. తొలినాళ్ళలో తెలుగు పత్రికలను స్థాపించిన ప్రముఖులలో కొక్కొండ వెంకటరత్నం పంతులు, కందుకూరి వీరేశలింగం పంతులు, శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రి, ఎ.సి.పార్థసారథి నాయుడు, సత్తిరాజు సీతారామయ్య, దేవగుప్తం శేషాచలపతిరావు మొదలైనవారు ఉన్నారు. అనంతర కాలంలో వచ్చిన పత్రికా ప్రముఖుల్లో కొందరు ముట్నూరి కృష్ణారావు, కాశీనాథుని నాగేశ్వరరావు, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి, తాపీ ధర్మారావు, నార్ల వెంకటేశ్వరరావు, ఏ.బి.కె. ప్రసాద్, రామోజీరావు. ఒక్కొక్కరు ఒకటి కంటే ఎక్కువ పత్రికలను ప్రచురించడం ఉండేది. చాలా పత్రికలకు స్వంత ముద్రణాలయాలుండేవి.
(ఇంకా…)

మీకు తెలుసా?

వికీపీడియా లోని కొత్త వ్యాసాల నుండి

  • ... క్యాన్సర్ వైద్య నిపుణుడు లూయిస్ జోస్ డి సౌజా వైద్యరంగంలో సేవలు చేసినందుకు 1992 లో పద్మశ్రీ పురస్కారం పొందాడనీ!
  • ... కొప్పం యుద్ధం దక్షిణ భారతదేశంలో ప్రముఖ రాజవంశాలైన చోళులకు, చాళుక్యులకు మధ్య జరిగిన యుద్ధమనీ!
  • ... ది డిస్కవరీ ఆఫ్ ఇండియా జవహర్‌లాల్ నెహ్రూ బ్రిటిష్ అధికారులు జైలులో నిర్బంధించినపుడు రాసిన పుస్తకమనీ!
  • ... ప్రస్తుతం పలు బ్యాంకుల విలీనం తర్వాత ఏర్పడ్డ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో బ్యాంక్ ఆఫ్ మద్రాస్ ఒక భాగమనీ!
  • ... మనుషులు కాకుండా ఇతర జంతువులు ఎలా ప్రవర్తిస్తాయో తెలిపేది ఇథాలజీ అనీ!
చరిత్రలో ఈ రోజు
జూలై 14:
ఈ వారపు బొమ్మ
రాతి ప్రదేశంలో కూడా పెరిగే సన్నజెముడు

రాతి ప్రదేశంలో కూడా పెరిగే సన్నజెముడు

ఫోటో సౌజన్యం: ఐ.మహేష్
మార్గదర్శి
ఆంధ్రప్రదేశ్
భారతదేశం
విజ్ఞానం , సాంకేతికం
భాష , సమాజం
తెలంగాణ
ప్రపంచం
క‌ళలు , ఆటలు
విశేష వ్యాసాలు


సోదర ప్రాజెక్టులు
కామన్స్ 
ఉమ్మడి వనరులు 
వికీసోర్స్ 
మూలాలు 
వికీడేటా 
వికీడేటా 
వికీబుక్స్ 
పాఠ్యపుస్తకాలు 
విక్షనరీ 
శబ్దకోశం 
వికీకోట్ 
వ్యాఖ్యలు 
మెటా-వికీ 
ప్రాజెక్టుల సమన్వయం 
ఈ విజ్ఞానసర్వస్వం గానీ, దీని సోదర ప్రాజెక్టులు గానీ మీకు ఉపయోగకర మనిపించినట్లయితే, దయచేసి వికీమీడియా ఫౌండేషన్‌కు సహాయం చెయ్యండి. మీ విరాళాలు ప్రాథమికంగా సర్వర్ సామాగ్రి కొనుగోలు చేయటానికి, వికీ ప్రాజెక్టులపై అవగాహన పెంపొందించడానికీ ఉపయోగిస్తారు.